మహిమాన్విత దేవాలయాలు Temples and It’s Importence
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.
దిక్కులు
“”””””””””””””
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం
మూలలు
“”””””””””””””””
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం
వేదాలు
“””””””””””””
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం
పురుషార్ధాలు
“””””””””””””””””””””
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా
పంచభూతాలు
“””””””””””””””””””””””
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.
పంచేంద్రియాలు
“”””””””””””””””””””””””””
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.
లలిత కళలు
“”””””””””””‘”‘”””””””
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.
పంచగంగలు
“””””””””””””””””””””
(1) గంగ,
(2) కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.
దేవతావృక్షాలు
“”””””””””””””””””””””””
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.
పంచోపచారాలు
“””””””””””””””””””””””””
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.
పంచామృతాలు
“””””””””””””””””””””””””
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.
పంచలోహాలు
“””””””””””””””””””””
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.
పంచారామాలు
“”””””””””””””””””””””””
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం
షడ్రుచులు
“””””””””””””””””
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.
అరిషడ్వర్గాలు (షడ్గుణాలు)
“””””””””””””””””””””””””””””””””””””””
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.
ఋతువులు
“”””””””””””””””””””
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర
సప్త ఋషులు
“”””””””””””””””””””””””
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.
తిరుపతి సప్తగిరులు
“””””””””””””””””””””””””””””””
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.
సప్త వ్యసనాలు
“”””””””””””””””””””””””
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.
సప్త నదులు
“”””””””””””””””””””””
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
నవధాన్యాలు
“”””””””””””””””””””””””
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.
నవరత్నాలు
“””””””””””””””””””””
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).
నవధాతువులు
“”””””””””””””””””””””””
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.
నవరసాలు
“””””””””””””””””””
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర
నవదుర్గలు
“””””””””””””””””””
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.
దశ సంస్కారాలు
“”””””””””””””””””””””””””
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం
దశావతారాలు
“””””””””””””””””””””””””
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.
జ్యోతిర్లింగాలు
“”””””””””””””””””””””””
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు ~ రామలింగేశ్వరం
తెలుగు వారాలు
“””””””””””””””””””””””””
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.
తెలుగు నెలలు
“””””””””””””””””””””””””
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
(9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.
రాశులు
“”””””””””””””
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.
తిథులు
“”””””””””””””””
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.
నక్షత్రాలు
“””””””””””””””””
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.
తెలుగు సంవత్సరాల పేర్లు
“”””””””””””””””””””””””””””””””””””””
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107
( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108
( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113
( 8 )భావ. –
1934, 1994, 2054, 2114
9యువ. –
1935, 1995, 2055, 2115
10.ధాత. –
1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. –
1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118
13.ప్రమాది. –
1939, 1999, 2059, 2119
14.విక్రమ. –
1940, 2000, 2060, 2120
15.వృష.-
1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. –
1942, 2002, 2062, 2122
17.స్వభాను. –
1943, 2003, 2063, 2123
18.తారణ. –
1944, 2004, 2064, 2124
19.పార్థివ. –
1945, 2005, 2065, 2125
20.వ్యయ.-
1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. –
1947, 2007, 2067, 2127
22.సర్వదారి. –
1948, 2008, 2068, 2128
23.విరోధి. –
1949, 2009, 2069, 2129
24.వికృతి. –
1950, 2010, 2070, 2130
25.ఖర.
1951, 2011, 2071, 2131
26.నందన.
1952, 2012, 2072, 2132
27 విజయ.
1953, 2013, 2073, 2133,
28.జయ.
1954, 2014, 2074, 2134
29.మన్మద.
1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136
31.హేవళంబి.
1957, 2017, 2077, 2137
32.విళంబి.
1958, 2018, 2078, 2138
33.వికారి.
1959, 2019, 2079, 2139
34.శార్వారి.
1960, 2020, 2080, 2140
35.ప్లవ
1961, 2021, 2081, 2141
36.శుభకృత్.
1962, 2022, 2082, 2142
37.శోభకృత్.
1963, 2023, 2083, 2143
38. క్రోది.
1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145
40.పరాభవ.
1966, 2026, 2086, 2146
41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147
42.కీలక.
1968, 2028, 2088, 2148
43.సౌమ్య.
1969, 2029, 2089, 2149
44.సాధారణ .
1970, 2030, 2090, 2150
45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151
46.పరీదావి.
1972, 2032, 2092, 2152
47.ప్రమాది.
1973, 2033, 2093, 2153
48.ఆనంద.
1974, 2034, 2094, 2154
49.రాక్షస.
1975, 2035, 2095, 2155
50.నల :-
1976, 2036, 2096, 2156,
51.పింగళ
1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159
54.రౌద్రి
1980, 2040, 2100, 2160
55.దుర్మతి
1981, 2041, 2101, 2161
56.దుందుభి
1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164
59.క్రోదన
1985, 2045, 2105, 216
60.అక్షయ
1986, 2046, 2106, 2166.
🙏ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..
సామెతలు
👍మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు
- అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
- అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
- అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
- అనువు గాని చోట అధికులమనరాదు
- అభ్యాసం కూసు విద్య
- అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
- అయితే ఆదివారం కాకుంటే సోమవారం
- ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
- ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
- ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
- ఇంట గెలిచి రచ్చ గెలువు
- ఇల్లు పీకి పందిరేసినట్టు
- ఎనుబోతు మీద వాన కురిసినట్టు
- చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
- కందకు లేని దురద కత్తిపీటకెందుకు
- కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
- కుక్క కాటుకు చెప్పుదెబ్బ
- కోటి విద్యలూ కూటి కొరకే
- నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
- పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
- పిట్ట కొంచెం కూత ఘనం
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
- వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
- కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
- మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
- ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
- ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
- ఆది లొనే హంస పాదు
- ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
- ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
- ఆకాశానికి హద్దే లేదు
- ఆలస్యం అమృతం విషం
- ఆరే దీపానికి వెలుగు యెక్కువ
- ఆరోగ్యమే మహాభాగ్యము
- ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
- ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
- అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
- అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
- అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
- ఏ ఎండకు ఆ గొడుగు
- అగ్నికి వాయువు తోడైనట్లు
- ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
- అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
- అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
- అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
- అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
- అప్పు చేసి పప్పు కూడు
- అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
- అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
- బతికుంటే బలుసాకు తినవచ్చు
- భక్తి లేని పూజ పత్రి చేటు
- బూడిదలో పోసిన పన్నీరు
- చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు - చాప కింద నీరులా
- చచ్చినవాని కండ్లు చారెడు
- చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
- విద్య లేని వాడు వింత పశువు
- చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
- చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
- చక్కనమ్మ చిక్కినా అందమే
- చెడపకురా చెడేవు
- చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
- చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
- చింత చచ్చినా పులుపు చావ లేదు
- చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట - చిలికి చిలికి గాలివాన అయినట్లు
- డబ్బుకు లోకం దాసోహం
- దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
- దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
- దాసుని తప్పు దండంతో సరి
- దెయ్యాలు వేదాలు పలికినట్లు
- దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
- దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
- దొంగకు తేలు కుట్టినట్లు
- దూరపు కొండలు నునుపు
- దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
- దురాశ దుఃఖమునకు చెటు
- ఈతకు మించిన లోతే లేదు
- ఎవరికి వారే యమునా తీరే
- ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
- గాజుల బేరం భోజనానికి సరి
- గంతకు తగ్గ బొంత
- గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు - గొంతెమ్మ కోరికలు
- గుడ్డి కన్నా మెల్ల మేలు
- గుడ్డి యెద్దు చేలో పడినట్లు
- గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
- గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
- గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
- గుడ్ల మీద కోడిపెట్ట వలే
- గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
- గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
- గురువుకు పంగనామాలు పెట్టినట్లు
- తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
- ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
- ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
- ఇంటికన్న గుడి పదిలం
- ఇసుక తక్కెడ పేడ తక్కెడ
- జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
- కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
- కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
- కాకి ముక్కుకు దొండ పండు
- కాకి పిల్ల కాకికి ముద్దు
- కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
- కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
- కాసుంటే మార్గముంటుంది
- కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
- కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
- కలి మి లేములు కావడి కుండలు
- కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
- కంచే చేను మేసినట్లు
- కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
- కందకు కత్తి పీట లోకువ
- కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
- కీడెంచి మేలెంచమన్నారు
- కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
- కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
- కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
- కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
- కూటికి పేదైతే కులానికి పేదా
- కొరివితో తల గోక్కున్నట్లే
- కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
- కొత్తొక వింత పాతొక రోత
- కోటిి విద్యలు కూటి కొరకే
- కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
- కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
- కృషితో నాస్తి దుర్భిక్షం
- క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
- కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
- కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
- ఉన్న లోభి కంటే లేని దాత నయం
- లోగుట్టు పెరుమాళ్ళకెరుక
- మెరిసేదంతా బంగారం కాదు
- మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
- మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
- మనిషి మర్మము.. మాను చేవ…
బయటకు తెలియవు - మనిషి పేద అయితే మాటకు పేదా
- మనిషికి మాటే అలంకారం
- మనిషికొక మాట పశువుకొక దెబ్బ
- మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
- మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
- మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
- మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
- మొక్కై వంగనిది మానై వంగునా
- మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
- మొసేవానికి తెలుసు కావడి బరువు
- ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
- ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
- ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
- ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
- నడమంత్రపు సిరి నరాల మీద పుండు
- నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
- నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
- నవ్వు నాలుగు విధాలా చేటు
- నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
- నిదానమే ప్రధానము
- నిజం నిప్పు లాంటిది
- నిమ్మకు నీరెత్తినట్లు
- నిండు కుండ తొణకదు
- నిప్పు ముట్టనిదే చేయి కాలదు
- నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
- నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
- ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
- ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
- ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
- బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
- ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
- ఊరు మొహం గోడలు చెపుతాయి
- పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
- పాము కాళ్ళు పామునకెరుక
- పానకంలో పుడక
- పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
- పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
- పండిత పుత్రః పరమశుంఠః
- పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
- పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
- పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
- పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
- పెళ్ళంటే నూరేళ్ళ పంట
- పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
- పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
- పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
- పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
- పిచ్చోడి చేతిలో రాయిలా
- పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
- పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
- పిండి కొద్దీ రొట్టె
- పిట్ట కొంచెము కూత ఘనము
- పోరు నష్టము పొందు లాభము
- పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
- పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
- పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
- పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
- రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
- రామాయణంలో పిడకల వేట
- రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
- రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
- రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
- రౌతు కొద్దీ గుర్రము
- ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
- చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
- సంతొషమే సగం బలం
- సిగ్గు విడిస్తే శ్రీరంగమే
- శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.
భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం…హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి
1. భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.
2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)
19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.
20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.
21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.
22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.
23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
28. భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము
30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు
31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.
32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.
33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.
34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” – శబ్దముతో గీత ప్రారంభమయినది.
35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.
36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.
37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.
38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.
39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.
40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.
41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.
42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.
43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.
44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)
45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.
46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.
47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.
48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)
50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.
51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.
52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.
53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.
54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.
55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.
56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.
57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.
58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.
60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.
61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.
62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.
63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.
64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.
65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.
66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.
67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.
68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.
69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.
70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.
71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.
72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)
73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.
74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.
75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.
76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.
77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.
78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.
79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.
80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.
81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.
82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.
83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.
84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.
85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.
86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.
87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.
88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.
90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.
91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.
92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.
93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.
94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.
95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= “అ”-కారము.
100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
105. తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.
💐💐💐🙏 🙏🙏💐💐💐