చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 01 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {ఏప్రిల్ – 01}🌎

🔎సంఘటనలు🔍

🌸1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.

🌸1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.

🌸1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారత దేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.

🌸1957: డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న ‘డబ్బు’, ‘రూపాయి’ లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.

🌸1960: TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.

🌸1973: పులుల సంరక్షన పథకం – కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.

🌸2001: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.

🌼జననాలు🌼

💛1578: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657)

💛1856: అకాసియో గాఅబ్రియెల్ వేగాస్, భారత దేశ ప్రముఖవైద్యుడు. (మ.1933)

💛1889: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940)

💛1911: ఫాజా సింగ్, భారత అథ్లెట్.

💛1911: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949)

💛1936: తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోంముఖ్యమంత్రి.

💛1941: అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.

💛1972: వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు.

💛1988: లహరి గుడివాడ, రంగస్థల నటి.

💐మరణాలు💐

🍁1922: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884)

🍁1943: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911)

🍁1999: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930)

🍁2012: ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921)

🍁2018: రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!